భీంగల్ మున్సిపాలిటీ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సాధారణ పరిశీలకులు సీహెచ్. సత్యనారాయణ రెడ్డి బుధవారం సందర్శించి, ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్ లు, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్ లను కూడా పరిశీలించారు. అంతకుముందు ఎస్. ఎస్. టీ బృందాల తనిఖీలను పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గంగాధర్, ఇతర అధికారులు ఆయన వెంట ఉన్నారు.