
హడలెత్తిస్తున్న పెద్దపులి.. శాటిలైట్ సిటీ సమీపంలో గుర్తింపు!
AP: రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం నియోజకవర్గాల్లో ఐదు రోజులుగా స్వేచ్ఛగా తిరుగుతున్న పెద్దపులి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. రోజుకో గ్రామానికి మారుతున్న పులి జాడను కనిపెట్టేందుకు అటవీ అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. చివరకు శాటిలైట్ సిటీలోని అక్కమ్మ కొండపై పులి సేద తీరుతున్నట్లు అధికారులు గుర్తించారు. పులిని ఎలాగైనా బంధించి దాని ఆవాసానికి తరలిస్తామని అధికారులు తెలిపారు.




