నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం నాగపూర్ గ్రామంలో శుక్రవారం ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారు బొమ్మిడిత రవి గృహప్రవేశ కార్యక్రమంలో
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మానాల మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటి కలను నెరవేర్చడమే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యమని, ఈ నూతన గృహంలో సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు
కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.