రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఆదర్శ పాఠశాల విద్యార్థి ఎంపిక

1చూసినవారు
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఆదర్శ పాఠశాల విద్యార్థి ఎంపిక
బాల్కొండ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థి రుచిత్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు ముత్యం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో ఈనెల 2, 3, 4, తేదీలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొంటారని తెలిపారు. రుచిత్ ను పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ప్రసాద్, పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు అభినందించారు.

సంబంధిత పోస్ట్