
అత్త, భర్త వేధింపులు భరించలేక గృహిణి ఆత్మహత్య
TG: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మాణిక్యమ్మ కాలనీలో నివాసం ఉండే భవాని (26) అత్త కనకమ్మ, భర్త శ్రీకాంత్‌ల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. మే 30న ఉదయం 8.30 గంటలకు భవాని తన తండ్రి ఎల్లయ్యకు ఫోన్ చేసి, కుటుంబ సభ్యులు మానసికంగా వేధించారని, ఇక బతకాలని లేదని చెప్పి, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




