కమ్మర్పల్లి మండల కేంద్రం శివారులోని అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి కోరెనర్సయ్య అనే రైతుకు చెందిన ఎకరం మొక్కజొన్న పంటపై అడవిపందులు దాడి చేసి ధ్వంసం చేశాయి. ఈ ఘటనపై రైతు ఫిర్యాదు మేరకు గురువారం అటవీశాఖ రేంజ్ అధికారి రవీందర్, డిప్యూటీ రేంజ్ అధికారి శ్రీనివాస్, బీట్ ఆఫీసర్, వ్యవసాయ విస్తీర్ణాధికారి కావ్య ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అడవిపందుల దాడితో రైతు తీవ్రంగా నష్టపోయాడు.