నిజామాబాద్ జిల్లా, బాల్కొండలోని భీమ్గల్ మండలంలోని కారేపల్లి గ్రామంలో శ్రీశ్రీశ్రీ శక్తిపీఠం జగదాంబ దేవి సేవాలాల్ మహారాజ్ 11వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కో-ఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలలో మున్సిపల్ చైర్మన్ బోదిరే నాగమణి స్వామి, వైస్ చైర్మన్ సంటి లత, నర్సయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ సురేందర్, మెండోరా సర్పంచ్ రమేష్, శ్రీను, రత్నయ్య, కారేపల్లి గ్రామ ఆలయ కమిటీ సభ్యులు నాయక్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.