ఐఐటీ మద్రాస్ స్కూల్ కనెక్ట్ విద్యార్థుల ఆన్లైన్ శిక్షణ కార్యక్రమానికి కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు చౌడారపు రాంప్రసాద్ శనివారం తెలియజేశారు. దీనివల్ల విద్యార్థులు పది రకాల ఆన్లైన్ కోర్సులను కోర్సుకు రూ. 500 చెల్లించి రెండు నెలలలో పూర్తి చేయాల్సి ఉంటుంది. పాఠశాలను ఎంపిక చేసినందుకు ఐఐటీ మద్రాస్ చైర్మన్ ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్ కృతజ్ఞతలు తెలియజేశారు.