రోడ్డు ప్రమాదంలో కూలీలకు గాయాలు

2చూసినవారు
రోడ్డు ప్రమాదంలో కూలీలకు గాయాలు
కమ్మర్పల్లి మండల కేంద్రం శివారులోని పల్లెచెరువు ప్రాంతంలో ఉపాధి పనులు చేయడానికి వెళ్లిన కూలీలను స్కూటీ అదుపుతప్పి ఢీకొనడంతో ఒక మహిళా కూలీ (సాయమ్మ) తుంటి ఎముక వద్ద తీవ్రంగా గాయపడ్డారు. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను కమ్మర్పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, సాయమ్మకు మెరుగైన వైద్యం కోసం మెట్పల్లి ఆస్పత్రికి తరలించారు. పనులు ముగించుకుని ఆటో ఎక్కుతున్న కూలీలను స్కూటీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న ఎంపీడీవో, ఏపీవో, టీఏ ఆస్పత్రికి చేరుకొని క్షతగాత్రులను పరామర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్