బాల్కొండ గ్రామపంచాయతీలో లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభించారు. ఆర్మూర్ లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి శనివారం గ్రామపంచాయతీ కార్యాలయంలో క్లినిక్ బుక్ ప్రారంభించారు. ఇకపై ప్రతి శనివారం ఉదయం 11 గంటల నుండి, సాయంత్రం ఐదు గంటల వరకు ప్యానల్ అడ్వకేట్ పవన్ కుమార్ ప్రజలకు న్యాయ సలహాలు, సలహాలపై అవగాహన, అవసరమైన న్యాయ సహాయం అందిస్తారని ఆమె తెలిపారు. గ్రామస్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజేష్, ఉప సర్పంచ్ రాజేందర్, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.