ధ్యాన మందిరాన్ని సద్వినియోగం చేసుకోండి: పిరమిడ్ మాస్టర్

538చూసినవారు
ధ్యాన మందిరాన్ని సద్వినియోగం చేసుకోండి: పిరమిడ్ మాస్టర్
నిజామాబాద్ జిల్లాలోని కమ్మరపల్లి మండలంలో ఉన్న శ్రీరామాంజనేయ పిరమిడ్ ధ్యాన మందిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిరమిడ్ మాస్టర్ మురళి గౌడ్ సూచించారు. ఈ మందిరంలో ఉదయం నుండి సాయంత్రం వరకు ఉచితంగా ధ్యానం చేసుకోవచ్చని, ఇప్పటికే ఎంతో మంది ధ్యానం చేస్తున్నారని తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలోని జాతీయ రహదారి పక్కన ఉన్న గ్రామాలలో కూడా ఇలాంటి ఉచిత ధ్యాన కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఎంతో మందికి ధ్యానం చేసుకునే అవకాశం లభిస్తుందని, ధ్యానమే దైవ సేవ అని ఆయన పేర్కొన్నారు. పత్రీజీ ధ్యాన మార్గాన్ని చూపించారని తెలిపారు.

సంబంధిత పోస్ట్