
పాకిస్థాన్‌లో వరుసగా ఐదోసారి తగ్గిన ఇంధన ధరలు
మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితులు మెరుగుపడటంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు శుక్రవారం భారీగా పతనమయ్యాయి. బ్రెంట్ క్రూడ్ 3.37% క్షీణించి బ్యారెల్‌కు 87.33 డాలర్లకు, డబ్ల్యూటీఐ క్రూడ్ 3.23% తగ్గి 84.88 డాలర్లకు చేరుకుంది. అయితే ఈ ధరల తగ్గుదల భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం చూపలేదు. మరోవైపు పాకిస్థాన్‌లో మాత్రం వరుసగా ఐదో వారం పెట్రోల్ లీటరుకు రూ.4, డీజిల్ రూ.2 చొప్పున తగ్గాయి. ఈ తాజా తగ్గింపు తర్వాత అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.373.78 (పాక్ కరెన్సీలో) కాగా, డీజిల్ ధర రూ.378.78 గా ఉంది.




