
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు
విమాన ప్రమాదంలో మరణించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలు ముగిశాయి. అశ్రునయనాల మధ్య అభిమానులు, పార్టీ నేతలు చివరిసారిగా వీడ్కోలు పలికారు. బారామతిలోని విద్యా ప్రతిష్టాన్ మైదానంలో ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా అజిత్ పవార్ అంత్యక్రియలు జరిగాయి. తమ నేతను కడసారి చూడటానికి భారీ ఎత్తున ఎన్సీపీ శ్రేణులు, మద్దతుదారులు, అభిమానులు తరలివచ్చారు.




