ఎస్సారెస్పీలోకి భారీ వరద.. 26 వరద గేట్ల ద్వారా నీటి విడుదల

5చూసినవారు
ఎస్సారెస్పీలోకి భారీ వరద.. 26 వరద గేట్ల ద్వారా నీటి విడుదల
మెండోర ఉత్తర తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేస్తున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి లక్ష 9వేల 654 క్యూసెక్కుల వరద చేరుతుండటంతో, గురువారం ఉదయం 26 వరద గేట్లను ఎత్తి నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. ఎస్ఈ జగదీష్ తెలిపిన వివరాల ప్రకారం, ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద రావడంతో ప్రాజెక్టు నీటిమట్టం గరిష్ఠస్థాయికి చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 80 టీఎంసీల నీటినిల్వ ఉంది. ఎస్కేప్ గేట్ల ద్వారా 8,000, సరస్వతి కాలువకు 650, ఆవిరి రూపంలో 573, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు వదులుతున్నారు. జూన్ 1 నుంచి ప్రాజెక్టులోకి 898 టీఎంసీల వరద చేరగా, 832 టీఎంసీల నీటిని దిగువకు వదిలారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్