జక్రాన్ పల్లి మండలంలోని సికింద్రాపూర్ గ్రామంలో ఎంపీపీఎస్ పాఠశాలను ఎంపీడీవో సతీష్ గురువారం తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం, వంటగది, పాఠశాల పరిసరాలను పరిశీలించి, రాబోయే వర్షాకాలంలో మరింత శుభ్రత పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అరుణ్ కుమార్, ఎం పి ఓ రాజేశ్వర్, గ్రామ కార్యదర్శి కవిత, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,
విద్యార్థులు పాల్గొన్నారు.