బాల్కొండ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముత్యాల సునీల్ రెడ్డి జన్మదిన వేడుకలు

5చూసినవారు
నిజామాబాద్ జిల్లా, బాల్కొండలో బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాల్కొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గున్నాల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి ఆనందం పంచుకున్నారు. అనంతరం మహంతి ఆశ్రమాన్ని సందర్శించి, అక్కడి చిన్నారులకు బిస్కెట్లు, పండ్లు పంపిణీ చేశారు. పిల్లలతో మాట్లాడి వారి అవసరాలు, సౌకర్యాల గురించి విచారించారు. సేవాధర్మే నిజమైన రాజకీయాల లక్ష్యమని గున్నాల వెంకటేష్ గౌడ్ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్