బాల్కొండ జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణం కోసం "నషాముక్త్
భారత్" కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి విద్యార్థి ఈ వ్యతిరేక ప్రచారంలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. హెచ్ఎం బట్టు రాజేశ్వర్, ప్రశాంత్ కుమార్, హెల్త్ ఆఫీసర్ సంతోష్, ఏఎన్ఎం సుజాత, ఆశా వర్కర్ లావణ్య, ఉపాధ్యాయ బృందం,
విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.