లయన్స్ క్లబ్ ఆఫ్ బాల్కొండ ఆధ్వర్యంలో "జాతీయ వైద్యుల దినోత్సవం" సందర్భంగా బుధవారం కిసాన్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ స్రవంతి, డాక్టర్ కీర్తన, డాక్టర్ యశ్వంత్ లను సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ బాల్కొండ అధ్యక్షులు మాట్లాడుతూ ప్రతి ఒక్క వైద్యుడు దైవంతో సమానమని, వైద్యులు అందించే సేవలు గొప్పవని కొనియాడారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు, యాదగిరి గౌడ్, సెక్రెటరీ, కనకయ్య గౌడ్, ట్రెజరర్ తదితరులు పాల్గొన్నారు.