
మళ్లీ పెరిగిన ముడి చమురు ధరలు
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ముడి చమురు ధరలు గణనీయంగా పెరిగాయి. బ్యారెల్ ముడిచమురు ధర 97.50 డాలర్లకు చేరుకుంది. ఈ ధరల పెరుగుదల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.




