
ట్రంప్ కఠిన షరతులతో పశ్చిమాసియాలో సూదీర్ఘ సంక్షోభం
పశ్చిమాసియాలో శాంతి ఒప్పంద ప్రయత్నాలు విఫలమవడంతో అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కఠిన షరతుల నేపథ్యంలో ఈ సంక్షోభం సుదీర్ఘంగా సాగేలా కనిపిస్తోంది. ఇరాన్ అణు ఆయుధాలను తయారు చేయబోదని అంగీకరించిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే, శాంతి ఒప్పందం పేరిట ట్రంప్ ఇరాన్‌కు అత్యంత కఠినమైన నిబంధనలతో కూడిన కొత్త ప్రతిపాదనలు పంపారని, దీంతో హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఇరాన్ తమ 12 బిలియన్ డాలర్ల ఆస్తులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది.




