భీమ్ గల్ లింబాద్రి గుట్టపై శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు గుట్టకు చేరుకుని స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఆదివారం గరుడ వాహనంపై స్వామి వారిని పుష్కరిణి వీధులలో ఊరేగించారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో శుద్ధ ద్వాదశి, గరుడ సేవ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. 'ఓ జగన్నివాసుడా మేల్కొని రా' అంటూ విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు జరిపించారు.