మెండోరా: ఎస్సారెస్పీలో కొనసాగుతున్న ఇన్ ప్లో

74చూసినవారు
మెండోరా: ఎస్సారెస్పీలో కొనసాగుతున్న ఇన్ ప్లో
మెండోరా మండలంలోని ఎస్సారెస్పీలో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ లోకి 5,778 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. స్థానిక ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గు ముఖం పట్టడంతో వరద రాక తగ్గింది. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 100, ఆవిరి రూపంలో 304, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 (80.5 టీఎంసీలు) అడుగులు కాగా శనివారం ఉదయం ప్రాజెక్ట్ లో 1066.40 (17.8 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.