నిజామాబాద్ జిల్లా, బాల్కొండ నియోజకవర్గంలోని ఎర్గట్ల మండలంలోని తొర్తి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతులు తక్కువ ధరకు దళారులకు అమ్మి మోసపోకుండా, కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివకుమార్, ఎర్గట్ల మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులు కౌడ భూమేష్, ఉప సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి, ఉప సర్పంచ్ సుమన్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు మహేష్, మండల యూత్
కాంగ్రెస్ అధ్యక్షుడు గంగా మోహన్, కార్యదర్శి రాహుల్, ఏపీవో గంగాధర్, రాకేష్, పేపర్ భూమన్న, మహిళా సంఘం సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.