భీమ్‌గల్ లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం: కేసీఆర్ కు కృతజ్ఞతలు

549చూసినవారు
భీమ్‌గల్ లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం: కేసీఆర్ కు కృతజ్ఞతలు
నిజామాబాద్ జిల్లా, బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని భీమ్‌గల్ పట్టణంలోని 5వ వార్డులో 25వ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కౌన్సిలర్ లావణ్య నర్సయ్య ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుకు కృతజ్ఞతలు తెలుపుతూ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహేందర్, నల్లూరి శీను, నరేష్, సుమన్, సేవ్వకృష్ణ, ప్రశాంత్, రాకేష్, రాజేశ్వర్, బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు.