కిసాన్ నగర్ గ్రామంలో ప్లాస్టిక్ రహిత విప్లవం ప్రారంభం

1227చూసినవారు
కిసాన్ నగర్ గ్రామంలో ప్లాస్టిక్ రహిత విప్లవం ప్రారంభం
బాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామంలో ప్లాస్టిక్ రహిత విప్లవం ప్రారంభమైంది. ప్రముఖ కాంట్రాక్టర్లు దేవా రెడ్డి, శరత్ కుమార్ కలిసి గ్రామ పంచాయతీకి 100 స్టీల్ ప్లేట్లు, 50 గ్లాసులను వితరణ చేశారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించి, పర్యావరణాన్ని పరిరక్షించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టారు. శుభకార్యాలకు ఈ సామాగ్రి ఉపయోగపడుతుందని సర్పంచ్ రామరాజు గౌడ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో భాస్కర్ రెడ్డి, ఎంపీ ఓ మోహన్, ఈవో శ్రీనివాస్, ఉప సర్పంచ్ స్వామి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్