గణేశ్ నిమజ్జనానికి రామన్నకుంట రోడ్డు ముస్తాబు

6చూసినవారు
గణేశ్ నిమజ్జనానికి రామన్నకుంట రోడ్డు ముస్తాబు
గణేశ్ నిమజ్జనాన్ని పురస్కరించుకుని భీంగల్ మున్సిపల్ అధికారులు రామన్నకుంట రహదారిపై ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. రహదారిపై మొరం పోసి చదును చేయడంతో పాటు నిమజ్జన మార్గంలో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. విగ్రహాల తరలింపునకు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్, కౌన్సిలర్ సతీష్, జై జై నరసయ్య పరిశీలించి పనులను పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్