శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న రష్మీ గౌతమ్

6చూసినవారు
శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న రష్మీ గౌతమ్
ప్రముఖ యాంకర్, సినీ నటి రష్మీ గౌతమ్ బాల్కొండలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మంగళహారతి సమర్పించారు. ఆలయ అర్చకులు ఆమెకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు అందించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో స్వామివారి సన్నిధిలో కొద్దిసేపు గడిపిన రష్మీ గౌతమ్, భక్తి భావంతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా కనిపించాయి.

సంబంధిత పోస్ట్