బాల్కొండ మండల కేంద్రంలోని వేలాది సంవత్సరాల క్రితం ప్రతిష్టించిన బ్రహ్మ సూత్ర శివాలయం, మార్కండేయ మందిరం, నారాయణుని దేవాలయాల పునర్నిర్మాణ పనులకు అవసరమయ్యే నిధుల మంజూరు కోసం, కాంట్రిబ్యూషన్ చెల్లింపు, మంజూరయ్యే నిధుల వివరాల కోసం నిజామాబాద్ జిల్లా ధర్మదాయ శాఖ సహాయక కమిషనర్ విజయరామరాజును బుధవారం బాల్కొండ పద్మశాలి సంఘం నాయకులు కలిశారు. గుడి పురాతన వైభవం, ప్రస్తుత ఆలయ స్థితిగతులు, నిర్మాణం గురించి సేకరించిన నమూనాలను దేవదాయ శాఖ కమిషనర్ కు వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ సానుకూలంగా స్పందించి, గుడి కొలతల గురించి ఇన్స్పెక్టర్ ను పంపుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు.