శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు రూ.32.55 కోట్లు: సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు

0చూసినవారు
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు రూ.32.55 కోట్లు: సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు
బాల్కొండ కాంగ్రెస్ ఇంచార్జీ ముత్యాల సునీల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆధునీకరణ, ప్రధాన కాలువల మరమ్మత్తుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రూ.32.55 కోట్ల నిధులు మంజూరు చేసింది. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు మరమ్మత్తులకు నోచుకోక కాలువలు శిథిలావస్థకు చేరాయని, కాకతీయ, వరద కాలువల మరమ్మత్తులకు ఈ నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయని పేర్కొన్నారు. కాకతీయ కెనాల్, వరద కెనాల్, ప్రాజెక్టు ఎర్త్ డ్యాం, డ్యాం వద్ద మేజర్ పనులు, గేట్ల వద్ద ఎలక్ట్రికల్ కేబుల్స్ వంటి వివిధ పనులకు ఈ నిధులు కేటాయించారు. సీఎం రేవంత్ రెడ్డి భారీ మొత్తంలో నిధులు మంజూరు చేసినందుకు ఆయనకు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్