భీమ్ గల్ మండలం, రహత్ నగర్ సమీపంలో గుగ్లోత్ కృష్ణ నిర్లక్ష్యంగా నడిపిన ట్రాక్టర్ ఢీకొని రామవత్ గోపాల్ (40) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో చౌడ తండా, రహత్ నగర్ గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు.