బాల్కొండ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో స్టీల్ బ్యాంక్ ప్రారంభం

0చూసినవారు
బాల్కొండ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో స్టీల్ బ్యాంక్ ప్రారంభం
బాల్కొండ మండల గ్రామపంచాయతీ పాలకవర్గం సహకారంతో ప్లాస్టిక్ రహిత బాల్కొండ కార్యక్రమంలో భాగంగా 3000 స్టీల్ ప్లేట్లు, 1000 స్టీల్ గ్లాసులతో కూడిన స్టీల్ బ్యాంక్ ఆదివారం ప్రారంభించారు. వినాయక చవితి సందర్భంగా అన్నదాన కార్యక్రమాలకు ఉచితంగా స్టీల్ ప్లేట్లు, గ్లాసులు అందించారు. భవిష్యత్తులో గ్రామంలో జరిగే అన్ని కార్యక్రమాలకు ఈ స్టీల్ బ్యాంక్ నుండే సేవలు అందించబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గాండ్ల రాజేష్, వార్డు సభ్యులు దయాకర్, సందీప్, ఫాజిల్, అతిక్, ఆయా సంఘ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్