నిజామాబాద్ జిల్లా బాల్కొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం 'మన ఊరు మన భద్రత మన బాధ్యత' కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బాల్కొండ ఎస్ఐ శైలేందర్ మాట్లాడుతూ,
విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ దేశాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. యువత దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని, విద్యార్థి దశ నుంచే మంచి మార్గంలో నడవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మురళి, అధ్యాపకులు,
విద్యార్థులు పాల్గొన్నారు.