బాల్కొండ కాంగ్రెస్ ఇంచార్జ్ సునీల్ రెడ్డి పరామర్శ

973చూసినవారు
బాల్కొండ కాంగ్రెస్ ఇంచార్జ్ సునీల్ రెడ్డి పరామర్శ
ఏర్గట్ల మండలంలో ఆదివారం పలువురు బాధిత కుటుంబాలను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి పరామర్శించారు. మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నర్సారెడ్డి తండ్రి భూమన్న మరణం, గడ్డం గంగారెడ్డి కుమారుడు శశికాంత్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడటం, గుమ్మిర్యాల్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు రాకేష్ కాలు విరగడం, బట్టాపూర్ గ్రామానికి చెందిన షేక్ అంకుష్ గుండెపోటుతో మరణించడం వంటి సంఘటనల్లో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, సంతాపం తెలిపారు.

సంబంధిత పోస్ట్