భీమ్గల్ మునిసిపల్ కార్యాలయం ముందు కొనసాగుతున్న కూరగాయల మార్కెట్ తొలగింపు వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. రోడ్డుపై మార్కెట్ వల్ల రాకపోకలకు, దుకాణాలకు ఇబ్బందులు కలుగుతున్నాయని దుకాణదారులు, వివిధ పార్టీల వారు అధికారులకు వినతిపత్రాలు అందించారు. సర్వ సమాజ్ కమిటీ వారు మార్కెట్ను నూతన స్థలంలో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సోమవారం సంత నేపథ్యంలో దుకాణాల ముందు కూరగాయల మార్కెట్ వద్దని కార్లు పార్కింగ్ చేయడంతో వ్యాపారులకు, దుకాణదారులకు మధ్య ఘర్షణ నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను సముదాయించారు. అధికారులు, పోలీసులు వ్యాపారులను నూతన మార్కెట్కు తరలించినా, కొందరు అక్కడి నుంచి తరలకపోవడంతో దుకాణదారులు, నాయకులు ప్రధాన రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.