మండలంలోని రెంజర్లలో 75 ఏళ్ల సాయమ్మ అనే వృద్ధురాలు గత 4 రోజులుగా కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయమ్మ ఇంటి నుంచి వెళ్లేటప్పుడు ఎరుపు రంగు బ్లౌజ్, నారింజ రంగు చీర ధరించిందని తెలిపారు. ఆమె ఆచూకీ తెలిస్తే 8712659762 నంబరులో సమాచారం అందించాలని కోరారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.