బాల్కొండ మండలంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలను ప్రత్యేక అధికారి రాకేష్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డ్రైనేజీ సమస్యపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులతో మాట్లాడి విద్యా ప్రమాణాలు, వసతుల గురించి తెలుసుకున్నారు. విద్యార్థుల సౌకర్యం కోసం సెల్ఫ్ లను ఏర్పాటు చేయాలని, డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయాలని అధికారులను ఆదేశించారు.