భీంగల్ కొత్త మార్కెట్‌లో ఎండల వేడిమి: వ్యాపారుల ఆవేదన

416చూసినవారు
భీంగల్ కొత్త మార్కెట్‌లో ఎండల వేడిమి: వ్యాపారుల ఆవేదన
నిజామాబాద్ జిల్లా, బాల్కొండలోని భీంగల్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన మార్కెట్ ప్రాంగణంలో ఎండల తీవ్రత కారణంగా వ్యాపారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బహిరంగ ప్రదేశంలో నీడ లేకపోవడంతో మధ్యాహ్నం వేళల్లో అక్కడికి వెళ్లడానికి ప్రజలు భయపడుతున్నారు. దీనివల్ల అమ్మకాలు తగ్గుతున్నాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి చెట్లు నాటడం, తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేయడం, తాగునీటి సౌకర్యాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్