జనగణన సర్వేకు శిక్షణ: ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించాలని సూచన

726చూసినవారు
జనగణన సర్వేకు శిక్షణ: ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించాలని సూచన
నిజామాబాద్ జిల్లా, బాల్కొండ పట్టణ మున్సిపల్ కార్యాలయంలో జనగణన సర్వేకు ఎనిమినేటర్లు, సూపర్వైజర్లకు మూడు రోజులపాటు శిక్షణ నిర్వహించారు. మాస్టర్ ట్రైనర్ల ఆధ్వర్యంలో సర్వే విధానం, నమోదు పద్ధతులపై అవగాహన కల్పించారు. పట్టణంలో 35 మంది ఎనిమినేటర్లు, ఆరుగురు సూపర్వైజర్లను నియమించి ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించాలని కమిషనర్ గోపు గంగాధర్ సూచించారు. ప్రజలు సర్వేలో నమోదు చేసుకుని పథకాల లబ్ధి పొందాలని కోరారు. ఈ సర్వే 2026 ఏప్రిల్ 29న ప్రారంభమైంది.

సంబంధిత పోస్ట్