ట్రాన్స్ ఫార్మర్లు ధ్వంసం.. ఆయిల్ చోరీ

7చూసినవారు
ట్రాన్స్ ఫార్మర్లు ధ్వంసం.. ఆయిల్ చోరీ
శనివారం రాత్రి ముప్కాల్ మండలంలోని కిసాన్ నగర్ శివా రు నాగులకుంట చెరువు, రాంమందిర్ వెనుక ప్రాంతాల్లోని వ్యవసాయ భూముల్లో ఏర్పాటు చేసిన 5 ట్రాన్స్ఫార్మర్లను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. వాటిలో నుంచి కాపర్ కాయిల్స్, ఆయిల్ చోరీకి గురయ్యాయి. ఈ ఘటనపై ట్రాన్స్కో ఈఈ సబావత్ కిషన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామాల్లో అపరిచితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై శైలేందర్ ప్రజలను కోరారు. ట్రాన్స్కో ఏఈఈ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్