బాల్కొండ మండల కేంద్రంలోని జామా మసీదులో ఈనెల 6న జరిగే వర్తమాన కాలంలో విద్యపై సదస్సు కోసం వాల్ పోస్టర్లను బుధవారం ఆవిష్కరించారు. మర్కస్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ మజారుద్దీన్, హఫీజ్, షాయబ్ ఈ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కోఆప్షన్స్ సభ్యుడు షాహిద్, మర్కజ్ కమిటీ ఉపాధ్యక్షుడు రియాజ్, సెక్రటరీ అక్బర్, క్యాషియర్ ఇమ్రాన్ ఖాన్, ఆఫీజ్, అబ్దుల్ రహమాన్ తదితరులు పాల్గొన్నారు.