నిజామాబాద్ జిల్లా బాల్కొండ మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గురించి ఆయన అనుచరుడు జయరాం శ్రీనివాస్ నాయక్ ప్రశంసలు కురిపించారు. ప్రశాంత్ రెడ్డి శిఖరంలా ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తులో ఉన్నా, ప్రజల కోసం ఎప్పుడూ తగ్గి ఉండే గుణం కలిగి ఉన్నారని, 'జనం జనం' అనే నినాదంతో పరిపాలనతో రాకెట్ల దూసుకుపోయే నేత అని పేర్కొన్నారు. కనివిని ఎరుగని అద్భుత విజయాలు, సంస్కరణలను చేసి చూపిన లెజెండ్ అని, ఎప్పుడూ ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో దూసుకుపోయే దిశాలి అని, దూరాలను దగ్గర చేసే కాలయంత్రం అని, సంక్షోభాన్ని తరిమి సస్యశ్యామలం చేసే ప్రకృతి వరం అని, కరువు కూడా భయపడేలా చేసే కర్షక రూపం అని, తెలంగాణ ఖ్యాతిని నలుదిక్కులా వర్తింపజేసిన నగధీరుడు అని, పరిపక్వ అనుభవం కలిగిన ఆదర్శ నాయకుడు అని, సొంత ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాల కోసమే ఆలోచించే నేత అని కొనియాడారు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే మానవత్వం వేముల ప్రశాంత్ రెడ్డి సొంతం అని అన్నారు.