ఓటరు జాబితా సవరణ: ఫారాల పంపిణీ వేగవంతం చేయాలి ..తహశీల్దార్

0చూసినవారు
ఓటరు జాబితా సవరణ: ఫారాల పంపిణీ వేగవంతం చేయాలి ..తహశీల్దార్
నిజామాబాద్ జిల్లా, బాల్కొండలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్)లో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా, వేగంగా పూర్తి చేయాలని ముప్కాల్ తహశీల్దార్ ముంతాజుద్దీన్ సోమవారం తెలిపారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ఓటర్లకు ఫారాల వివరాలను వివరిస్తూ సహకారం అందిస్తున్నారు. బీఎల్వోలకు ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు బాధ్యతాయుతంగా విధులు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఎల్వోలు, సూపర్ వైజర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్