
నిద్రిస్తున్న భర్తపై కత్తితో దాడి చేసి చంపిన భార్య
TG: మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో దారుణ ఘటన వెలుగు చూసింది. భర్తను భార్య హత్య చేసింది. నిద్రిస్తున్న భర్త నగేష్ పై కత్తితో దాడి చేసి భార్య కవిత చంపింది. అనంతరం భర్త ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించే ప్రయత్నం చేసింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




