నిజామాబాద్ జిల్లా, బాల్కొండలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు లక్ష్మీ కాలువ ద్వారా 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని
బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా ప్రాజెక్టు అధికారులకు బుధవారం వినతిపత్రం సమర్పించింది. 48 గంటల్లో నీటి విడుదల చేయకపోతే ఆయకట్టు రైతులతో కలిసి రోడ్డుపై ధర్నా నిర్వహిస్తామని
బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ముస్కు నర్సయ్య హెచ్చరించారు.