పిప్రి జే గ్రామంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు

1చూసినవారు
భీంగల్ మండలంలోని పిప్రి జే గ్రామంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి బుధవారం  నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ జనార్దన్ మాట్లాడుతూ వైయస్సార్ రైతుల బంధువు, రైతు మిత్రుడు, పేదల పెన్నిధి అని కొనియాడారు. ఆయన ప్రారంభించిన రాజీవ్ ఆరోగ్యశ్రీ, రాజీవ్ యువశక్తి వంటి మహోత్సవ కార్యక్రమాల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రంజిత్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు దేవేందర్ గౌడ్, గంగస్వామి, రంజిత్, ప్రతాప్, రాజేష్, నారాయణ, శ్రీనివాస్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్