బాన్సువాడలో 29 ఏళ్ల యువకుడు అదృశ్యం: పోలీసుల గాలింపు

1359చూసినవారు
బాన్సువాడలో 29 ఏళ్ల యువకుడు అదృశ్యం: పోలీసుల గాలింపు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో అక్టోబర్ 31, 2025 ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లి 29 ఏళ్ల ప్రవీణ్ గౌడ్ అదృశ్యమయ్యాడు. మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఇంట్లోనే ఉంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 5.3 అడుగుల ఎత్తు, చామనఛాయ రంగు, కోలముఖం కలిగిన ప్రవీణ్, ఎరుపు రంగు షర్టు, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. అతని ఆచూకీ తెలిసినవారు బాన్సువాడ పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.