కామారెడ్డి జిల్లా పిట్లo మండలం మద్దెల చెరువు గ్రామంలో శుక్రవారం చలో హైదరాబాద్ కరపత్రం ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా మాల సంఘం రాష్ట్ర నాయకులు అయ్యాల సంతోష్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ప్రకటించే ఉద్యోగ నోటిఫికేషన్లలో రోస్టర్ విధానం వల్ల మాలలకు ఉద్యోగాలు రావడం లేదని, వారికి తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. రోస్టర్ పాయింట్ విధానాన్ని తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈనెల 5న హైదరాబాదులో మాల మహా ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.