వర్ని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే పోచారం

391చూసినవారు
వర్ని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే పోచారం
వర్ని మండల కేంద్రంలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని బాన్సువాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి సందర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను కలిసి వారికి అందుతున్న వైద్య సేవలు, సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీసీహెచ్‌ఓ శ్రీనివాస్ ప్రసాద్‌తో మాట్లాడి వైద్య సిబ్బంది కొరత, అవసరమైన నియామకాలు, వైద్య పరికరాలు, మౌలిక సదుపాయాలపై చర్చించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని, రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు.

సంబంధిత పోస్ట్