జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన జంగం సాయికృష్ణ యూకేలో అరుదైన వింగ్ వాక్ చేసి ఆకట్టుకున్నారు. సిరెంసెస్టర్‌లో సుమారు 3, 000 అడుగుల ఎత్తులో, గంటకు 100 మైళ్ల వేగంతో ప్రయాణిస్తున్న బైప్లేన్‌పై నిలబడి
జనసేన జెండాను ప్రదర్శించారు. సాయికృష్ణ సాహసాన్ని
జనసేన శ్రేణులు, ప్రవాస భారతీయులు ప్రశంసిస్తున్నారు.