Feb 10, 2026, 02:02 IST/
ఉస్తాద్ భగత్ సింగ్ రెండో పాట లీక్!
Feb 10, 2026, 02:02 IST
పవన్ కళ్యాణ్ నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం వచ్చే నెల 26న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, చిత్రానికి సంబంధించిన ప్రచార కంటెంట్‌ను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'దేఖ్ లేంగే సాలా' పాటకు మంచి స్పందన లభించింది. అయితే, శివరాత్రి కానుకగా విడుదల చేయాలనుకున్న రెండో పాట సోషల్ మీడియాలో లీక్ అయినట్లు తెలస్తోంది. ఈ పాట పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సాంగ్ అని, 'ఎత్తు ఎత్తు..కాలరే ఎత్తు' అంటూ సాగే ఈ పాట ఊర మాస్ బీట్తో ఉందని, డ్యాన్స్ అదరగొట్టేలా ఉందని సమాచారం.